సిడ్నీ అందాల 'శంఖం'
గోపిచంద్, త్రిష జంటగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై శివ ('శౌర్యం' ఫేమ్) దర్శకత్వంలో జె.భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్న క్రేజీ చిత్రం 'శంఖం'. ఆస్ట్రిలియాలోని సిడ్నీ, హంటర్ వ్యాలీ, ఒపేరా హౌస్, డార్లింగ్ హార్బర్ తదితర సుందర ప్రదేశాల్లో రెండు కీలక పాటలు, కొన్ని దృశ్యాల చిత్రీకరణ జరుపుకొని చిత్రయూనిట్ హైద్రాబాద్ చేరుకుంది.
నిర్మాతలు ఆ విశేషాలను తెలియజేస్తూ, జూన్ 21 నుంచి ఈనెల 9వ తేదీ వరకూ రెండు బ్యూటిఫుల్ సాంగ్స్, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించామనీ చెప్పారు. గోపీచంద్, త్రిష, చంద్రమోహన్, శ్రీనివాస రెడ్డిపై కొన్ని సన్నివేశాలు, అక్కడి వైన్ తోటల్లో ఆలీ, రజిత, హేమ, తెలంగాణ శకుంతల, ధర్మవరపు సుబ్రమణ్యం తదితరులపై మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించామని తెలిపారు. తాము షూటింగ్ జరుపుతున్న సమయంలో చలి విపరీతంగా ఉన్నప్పటికీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోగా ప్లాన్ చేసుకుని అనుకున్న వర్క్ ను పూర్తి చేశామని చెప్పారు. సిడ్నీలో చేసిన ఘాటింగ్ తో 90 శాతం సినిమా పూర్తయిందనీ, మరో పాట, మూడు రోజుల టాకీ మిగిలి ఉందనీ దర్శకుడు శివ తెలిపారు. ఈనెల 18 నుంచి వీటిని చిత్రీకరిస్తామన్నారు. ఆగస్టు ప్రథమార్థంలో ఆడియో రిలీజ్ ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి అనీల్ రావిపూడి మాటలు, వెట్రి సినిమాటోగ్రఫీ, విజయ్, సెల్వ, గణేష్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, తమన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|