150 ప్రింట్లతో 'అడవి'
నితిన్, ప్రియాంక కొఠారి జంటగా యూటీవీ మోషన్ పిక్చర్స్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా చిత్రం 'అడవి'. హిందీలో 'అజ్ఞాత్' పేరుతో ఈ చిత్రం విడుదలవుతుంది. ఆర్.స్కేర్నివాలా, రామ్ గోపాల్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న'అడవి' చిత్రాన్ని విశాఖ టాకీస్ సమర్పణలో ఆగస్టు 7న విడుదల చేస్తున్నట్టు చిత్ర సహనిర్మాత నట్టికుమార్ తెలిపారు.
రామ్ గాపాల్ వర్మ సినిమాలకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందేననీ, దానిని దృష్టిలో పెట్టుకునే తాము ఈ చిత్రం రైట్స్ తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. సినిమా రిలీజ్, ప్రమోషన్ విషయంలో తన ప్లానింగ్ గురించి వర్మకు నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సుధాకర్ రెడ్డి తెలియజేయడంతో ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం తనకు లభించిందని చెప్పారు. సినిమా రిలీజ్ కు ముందే ప్రమోషన్ వర్క్ చేపట్టనున్నామనీ, హైద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలులో చేపట్టే ప్రమోషన్ కార్యక్రమాల్లో రామ్ గోపాల్ వర్మ కూడా పాల్గొంటారనీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 150 తెలుగు ప్రింట్లతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్టు పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|