నాలుగు జంటల 'రియాలిటీ'
కాలేజీ కథాంశంతో నాలుగు కొత్త జంటలతో రూపొందుతున్న చిత్రం 'రియాలిటీ'. రవికిరణ్, నితీష్, మోహన్, రామకృష్ణ హీరోలు కాగా, శైలు, సందీప్తి, హేమ, హసిని హీరోయిన్లు. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై ఆనంద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్.హెచ్.రాయుడు దర్శకుడు. హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో శుక్రవారంనాడు ఈ చిత్రం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి జగదీశ్వర్ వైత్యా క్లాప్ ఇవ్వగా, డాక్టర్ జి.వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు.
కాలేజీ నేపథ్య కథాంశంతో ఈ చిత్రం ఉంటుందనీ, స్టోరీ డిమాండ్ మేరకు కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నామనీ తెలిపారు. హైద్రాబాద్, అరకు, వైజాగ్ లలో షూటింగ్ మూడు షెడ్యూల్స్ లో ప్లాన్ చేశామని అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశ రావడం సంతోషంగా ఉందని నూతన హీరోహీరోయిన్లు పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జాకీ, జూనియర్ రేలంగి, జెన్ని, రాంరెడ్డి, కాస్ట్యూమ్స్ కృష్ణ, గౌతంరాజు, సహదేవ్ సిద్ధయ్య తదితరులు నటిస్తున్నారు. జి.నాగేశ్వరరావు మాటలు, పూర శ్రీనివాస్-కెఎరాజు పాటలు, పొన్నాడ పూర్ణచంద్ర సినిమాటోగ్రఫీ, జె.జాస్యప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|