3 సినిమాల్లో సుశాంత్
'కాళిదాసు', 'కరెంట్' చిత్రాలతో హీరో సుశాంత్ యూత్ లో బాగా రిజిస్టర్ అయ్యారని ఆ రెండు చిత్రాల నిర్మాతల్లో ఒకరైన చింతలపూడి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారంనాడు సంస్థ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, 'కరెంట్' సినిమాతో సుశాత్ గురించి అమ్మాయిలు కూడా చర్చించుకుంటున్నారనీ, ఈ చిత్రానికి బి,సి కేంద్రాల్లో చాలా గొప్ప ఆదరణ లభిస్తూ మంచి షేర్ వస్తోందని తెలిపారు. యాక్షన్ ప్రధానంగా మాస్ అంశాలతో సుశాంత్ తో సినిమా చేయాలని అభిమానుల కోరిక మేరకు త్వరలో మరో చిత్రాన్ని సుశాంత్ తో చేయబోతున్నామనీ, అలాగే సుశాంత్ మరో రెండు బయట చిత్రాల్లో కూడా చేయనున్నారనీ, ప్రస్తుతం అవి చర్యల దశలో ఉన్నాయనీ తెలిపారు.
శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై 3 వరుస చిత్రాల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామని ఆయన చెప్పారు. వీటిలో ఒకటి సుశాంత్ హీరోగా, మిగతా రెండు బయట హీరోలతో ఉంటాయన్నారు. సుశాంత్ తో తీయబోయే చిత్రం కోసం ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయనీ, పేరుపొందిన దర్శకుడితోనే ఈ సినిమా చేయాలనుంటున్నామనీ తెలిపారు. కథ సిద్ధంకాగానే సినిమా మొదలవుతుందనీ, ఇప్పటికి 20 కథలు విన్నామనీ తెలిపారు.
Be first to comment on this News / Article!
|