ఆగస్టులో 'ఫ్రూట్ సలాడ్'
ఏడుగురు హీరోలు, ఏడుగురు హీరోయిన్లు, ఏడు తీయటి ప్రేమకథలతో ప్రయోగాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'ఫ్రూట్ సలాడ్'. సెవన్ హిల్స్ పతాకంపై సురేష్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఇనగడప సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇ.శ్రీనివాస్, శియా గౌతమ్ ('నేనింతే' ఫేమ్) క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోందనీ, ఇంతవరకూ 50 శాతం షూటింగ్ పూర్తయిందనీ నిర్మాత తెలిపారు.
విశ్వజనీనమైన ప్రేమలోని కొన్ని ఎమోషన్స్ ని పండ్లలోని రుచులతో పోలుస్తూ కొత్తతరహాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకుడు సురేష్ తెలిపారు. కొత్త, పాత తారలు ఇందులో నటిస్తున్నారనీ, అన్నివర్గాల వారిని ఈ చిత్రం అలరిస్తుందనీ చెప్పారు. ఆగస్టు మొదటివారంలో ఆడియో, చివరి వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో విశ్వ, సందీప్తి, సోనానియోగి, సంజిత్, బ్రహ్మాజీ, సురభిప్రభు, సింధు, సత్యేందర్, శ్రీరామ్, అమృత, పావనిరెడ్డి, సాయికుమార్, శరత్ బాబు, రఘు, పావలా శ్యామల, అంబటి శ్రీను, నానాజీ తదితరులు నటిస్తున్నారు. ఓం ప్రకాష్ మార్తా మాటలు, ఎ.ఎం.విజయ్ సినిమాటోగ్రఫీ, సత్య వై సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|