రియల్ స్టోరీతో 'నజరానా'
హైద్రాబాద్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'నజరానా'. శ్రీమతి వై.శైలజ సమర్పణలో ఐమాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వై.కోటిబాబు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు కోటిబాబు తెలిపారు.
భారతదేశమంటే శత్రుదేశమని భావించే ఓ పాకిస్తానీ ఇండియాకు వచ్చి ఇక్కడి ఆప్యాయతానురాగాలకు ఎలా స్పందించాడన్నదే ఈ చిత్ర కథ అనీ, సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని మలిచామనీ ఆయన తెలిపారు. డాక్టర్ గా హీరోయిన్ కల్యాణి, ఓ ప్రత్యేక పాత్రలో సుమన్ నటించారని చెప్పారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం, ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడిన ఓ పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలనీ, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, నందమూరి హరి ఎడిటింగ్ చాలా యాప్ట్ గా ఉంటాయని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో విజయ్ చందర్, సూర్య, రామిరెడ్డి, సమీర్, పి.జె.శర్మ, ప్రీతినిగమ్, కల్యాణ్, మాస్టర్ కార్తిక, బేబి గ్రీష్మ తదితరులు నటించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం కోటిబాబు అందించగా, ప్రతాప్ వి కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|