పెద్ద హీరోతో ఛార్మి 'సై ఆట'
ఛార్మింగ్ లేడీ ఛార్మి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'సై ఆట'. పవన్ దర్శకత్వంలో ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నల్లూరి రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ ప్రముఖ హీరో, ఛార్మి కాంబినేషన్ లో ఈ పాటను భారీగా చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత రాజశేఖర్ తెలియజేశారు.
'సై ఆట' చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నామనీ, ఇటీవలే ఛార్మి, బాలనటులు, 60 మంది డైన్సర్లుగా పాల్గొన్న ఓ సాంగ్ ను హైద్రాబాద్ లోని ఓ గార్డెన్ లో వేసిన భారీ సెట్లో చిత్రీకరించామనీ, బ్యాలెన్స్ పాటను కూడా త్వరలోనే చిత్రీకరిస్తామని చెప్పారు. వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం ఉంటుందనీ, ప్రస్తుతం గ్రాఫిక్, సీజీ, రీరికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టులో ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలో ఛార్మి పాత్రను చాలా కొత్తగా మలిచామనీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం హైలైట్ అవుతుందనీ దర్శకుడు పవన్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, డాక్టర్ శివప్రసాద్, అజయ్, నాజర్, ప్రభాకర్, రావురమష్, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్నారు. భాషాశ్రీ పాటలు, జె.ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|