'వీడు మనవాడే' ఆడియో
శ్యామ్ ('కిక్' ఫేమ్), మల్లికాకపూర్ హీరోహీరోయిన్లుగా 'వీడు మనవాడే' చిత్రం రూపొందింది. నేతాజీ దర్శకత్వంలో అన్నం ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై సి.విజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారంనాడు ఈ చిత్రం ఆడియో వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని మరో అతిథి సాగర్ కు అందజేశారు.
దాసరి మాట్లాడుతూ, నేతాజా మంచి కథారచయితే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారని చెప్పారు. గతంలో ఆయన తీసిన 'ధ్వని-ప్రతిధ్వని' చిత్రంలో కృష్ణంరాజు కాంబినేషన్ లో తాను నటించాననీ, కారణాంతరాల వల్ల ఆ చిత్రం పూర్తి కాలేదనీ అన్నారు. అలాగా దిన ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడనీ, ఈ చిత్రంలోని పాటలు అందరినీ ఆకట్టుకుంటాయనీ అన్నారు. ఇప్పటికే 'కిక్' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్యామ్ ఈ చిత్రంతో మరింత దగ్గరవుతారని అన్నారు. నేతాజా కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'ఉన్నయ్ విడమారె' విజయం సాధించిందనీ, ఆచిత్రం తెలుగు హక్కుల కోసం పోటీపడిన వారిలో తాను కూడా ఉన్నానని అన్నారు. అయితే ఆ చిత్రాన్ని శ్రీమతి విజయనిర్మల సంపాదించి నరేష్ తో సినిమా తీశారని చెప్పారు. 'కిక్' శ్యామ్ తో నేతాజీ తీసిన ఈ చిత్రం ఆడియోతో పాటు బాక్సాఫీస్ హిట్ ను కూడా సొంత చేసుకోవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమిళంలో ఈ సినిమా పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయనీ, తెలుగులో కూడా మంచి ఆదరణ చూరగొంటాయనే నమ్మకాన్ని దిన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సూర్యకిరణ్, సింధూరపువ్వు కృష్ణారెడ్డి, నటీనటులు కల్యాణి, విజయభాస్కర్, చెన్నై లా కాలేజీ ప్రొఫెసర్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీం మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
Be first to comment on this News / Article!
|