నాగచైతన్య 'జోష్' ఆడియో
దిల్ రాజు మాట్లాడుతూ, నాగచైతన్యను 'కొత్తబంగారులోకం' చిత్రంతో పరిచయం చేయాలనుకున్నాననీ, అయితే నాగార్జున సూచన మేరకు 'జోష్' తో పరిచయం చేశామనీ చెప్పారు. మంచి కథ కోసం చూస్తున్నప్పుడు వాసువర్మ ఓ స్క్రిప్టుతో రావడం, ఆ స్క్రిప్టు నాగార్జునకు, నాగచైతన్యకు నచ్చడంతో వెంటనే ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టామన్నారు. నాగార్జునతో పాటు, నాగచైతన్య తాతగారైన రామానాయుడుకు పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నప్పటికీ తన బ్యానర్ లో చైతన్యను పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి తన కృతజ్ఞతలని అన్నారు. వారు తనమీద నమ్మకం ఉంచారనీ, అందుకు తగ్గట్టే ఆ చిత్రం చాలా పెద్ద హిట్టవుతుందనే గట్టి నమ్మకం తనకుందని అన్నారు. ఈ చిత్రం తమ సంస్థకు ట్రిపుల్ హ్యాట్రిక్ ను అందిస్తుందన్నారు. ఈ చిత్రంలో ఒక లెంగ్తీ సన్నివేశం ఉందనీ, ఆ సన్నివేశాన్ని చైతన్య సింగిల్ టేక్ లో ఓకే చేసి తన ప్రతిభను చాటుకున్నాడని ప్రశంసించారు. వాసువర్మ ఈ చిత్రాన్ని ఎంతో కసిగా తెరకెక్కించారనీ, సందీప్ చౌతా అద్భుతమైన సంగీతాన్ని అందించారనీ చెప్పారు. ఆగస్టులో రిలీజ్ ఉంటుందని తెలిపారు.
నాగచైతన్య మాట్లాడుతూ, ఈ రోజు కోసమే తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాననీ, 'కింగ్' ఆడియో ఫంక్షన్ లో కూడా ఇదే చెప్పాననీ, అప్పుడు ఫ్యాన్స్ తనకు ఇచ్చిన ప్రోత్సాహం తాను ఎప్పుడూ మరిచిపోననీ అన్నారు. అదే ఉత్సాహంతో తాను 'జోష్' కు పనిచేశాననీ, సినిమా రిలీజ్ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నాననీ పేర్కొన్నారు. కార్తిక మాట్లాడుతూ, తాను నటికావాలనే ఆలోచనతో పెరగలేదనీ, నటనను వృత్తిగా తీసుకువాలని అనుకున్నప్పుడు చాలా యోచన చేశాననీ చెప్పుకొచ్చింది. తాను నటిగా మారడానికి తన తల్లి రాధ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు పేర్కొంది. గోల్డెన్ హ్యాండ్ గా పేరున్న దిల్ రాజు చిత్రంతో నాగచైతన్య సరసన హీరోయిన్ గా పరిచయమవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు నాగార్జున, ఆయన సినిమాలంటే చాలా ఇష్టమనీ, తన ఫేవరేట్ హీరో వెంకటేష్ అనీ తెలిపారు. వారంతా ఇదే వేదికపై ఉండటం తనకు మరింత ఉత్సాహాన్నిస్తోందన్నారు. ప్రేక్షకాభిమానులంతా తమకు ఆశీస్సులు అందించాలని కోరారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|