నాగార్జున అప్పగింతలు...
పరిశ్రమతో దశాబ్దాలుగా మమేకమవుతూ చెక్కుచెదరని అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ ఫ్యామిలీస్ నుంచి ఇప్పుడు కొత్తతరం హీరోల జోరు పెరుగుతోంది. దీంతో సీనియర్ హీరోల నుంచి వారి మరోతరం వారసులను ప్రోత్సహించే బాధ్యత అభిమానులపై మరింత పెరుగుతోంది. కొద్దికాలం క్రితమే మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ 'చిరుత'తో తెరంగేట్ర చేసినప్పుడు చిరంజీవి సైతం ఎంతో ఎగ్జయిట్ మెంట్ ప్రదర్శించారు. 'చరణ్ ను ఆదరించి...అతనికి అన్నిరకాలుగా అందడండలు అందించాల్సిన బాధ్యత అభిమానులకే విడిచిపెడుతున్నాను. చరణ్ ను మీకే అప్పగిస్తున్నాను' అంటూ చిరంజీవి ఎంతో ఉద్వేగంగా అప్పగింతలు చేశారు. చిరంజీవితో పాటు అగ్రహీరోగా వెలుగొందుతున్న నాగార్జున సైతం ఇప్పుడు తన తనయుడు నాగచైతన్యను 'జోష్'తో హీరోగా పరిచయం చేస్తూ...ఆడియో వేడుకలో చైతన్య బాధ్యతను అభిమానుల భుజస్కంధాలపై ఉంచారు.
'చైతన్య నాకంటే తెలివైనవాడు. చైతన్యకు ఎ.ఎన్.ఆర్., రామానాయుడు వంటి ఇద్దరు తాతలు ఉన్నాయి. వారిద్దరూ లివింగ్ లెజెండ్స్. నాన్నగారు చేరుకున్న హైట్స్ కు నేను చేరుకోలేకపోయాను. అయితే చైతన్య మాత్రం అంతటి స్థాయికి చేరుకువాలని ఓ తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కారణాలు ఏవైనా నేను నటనను వృత్తిగా స్వీకరించే ముందు ఇంజనీరింగ్ చేశాను. చైతన్య మాత్రం టెన్త్ కాగానే నటించాలనే కోరికను నాతో చెప్పాడు. కనీసం డిగ్రీ అయినా చేయమని అన్నారు. బికామ్ డిగ్రీ పూర్తి చేశాడు. ఏమాత్రం సమయం వృథా కాకుండా యాక్టింగ్ లోకి అడుగుపెట్టాడు. నేను ఉండగానే చైతన్య ను హీరోగా చూడాలనుంటున్నట్టు నాన్నగారు నాతో అన్నారు. నాగచైతన్య 100వ సినిమా కూడా నాన్నగారు చూస్తారనే నమ్మకం నాకుంది. మూడు దశాబ్దాలుగా అక్కినేని ఫ్యామిలీకి అభిమానులు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. ఇప్పుడు చైతన్య వచ్చాడు. అతని బాధ్యత కూడా అభిమానులు భూజాల మీద వేసుకుని ఆదరించాలని కోరుకుంటున్నాను' అని నాగార్జున అభిమానుల హర్షధ్వానాల మధ్య అప్పగిలింతలు చెప్పారు. అక్కినేని అభిమానులు వంశపారంపర్యంగా చైతన్య వెంటే ఉంటారనడంలో సందేహం లేదు కానీ, కొత్తతరం ఆడియెన్స్ ను కూడా చైతన్య తన ఖాతాలో వేసువేకోవాల్సి ఉంటుంది. వారసత్వ బలం అనేది ఒకటి రెండు సినిమాల వరకూ ఇబ్బంది ఉండదు. అప్పటికి సొంత గుర్తింపు తెచ్చుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ చైతూ...
Be first to comment on this News / Article!
|