పాటేసుకున్న దిల్ రాజు
డైనమిక్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 'గోల్డెన్ టచ్' గురించి పరిశ్రమలో కథలు కథలుగా చెప్పుకోవడం పరిపాటి. ఎప్పటికప్పుడు కొత్త తారలు, దర్శకులను పరిచయం చేస్తూ కోరుకున్న హిట్లు దక్కించుకుంటున్నారు. 'మున్నా' మినహాయిస్తే ఆయన నిర్మించిన సినిమాలన్నీ హిట్లే. ఆ సినిమాను కూడా హిట్ల ఖాతాలోకి దిల్ రాజు వేసేసుకోవడం వేరే కథ. నాగార్జున తనయుడు నాగచైతన్యను ఇప్పుడు 'జోష్' తో పరిచయం చేస్తూ స్టార్ హీరోల వారసులు ఇక నుంచి తన బ్యానర్ కు అటాచ్ అవుతారనే ధీమాతో ఉన్నారు. మరోవైపు వరుణ్ సందేష్ తో 'మరోచరిత్ర', ఎన్టీఆర్ తో 'బృందావనం'...ఇలా వరుస సినిమాల ప్లానింగ్ లో ఉన్నారు. అసలు హీరోకి కావాల్సిన లక్షణాలు దిల్ రాజులో పుష్కలంగా ఉన్నాయనేది ఆయన అనుచరగణం ఊదరగొట్టేస్తుంటారు. ఎందుకో దిల్ రాజు మాత్రం అటువైపు ఇంకా మొగ్గుచూపలేదు. అయితే ఇప్పుడు ఆయన మరో కొత్త అవతారం ఎత్తారు. 'జోష్' సినిమాలో 'అన్నయ్య వచ్చాడంటూ' ఓ పాట పాడేసి సింగర్స్ క్లబ్ లోకి చేరిపోయారు.
'పాడటం గురించి నాకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ హమ్మింగ్ చేస్తుంటాను. అది చూసి మీరే ఎందుకు పాడకూడదంటూ దర్శకుడు వాసువర్మ పట్టబట్టాడు. రచయిత చంద్రబోస్ పాడేవరకూ వదిలిపెట్టలేదు. ఇక పాడక తప్పింది కాదు. అలా ఓ పాట పాడేశా' అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. సోమవారం నుంచే 'జోష్' ఆడియో మార్కెట్ లోకి వచ్చింది. దిల్ రాజు పాటకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఇంకా తేలాల్సి ఉంది. పాటతో పాటు ఆగస్టులో విడుదలవుతున్న 'జోష్' కూడా సక్సెస్ అయితే దిల్ రాజు సాంగ్ సెంటిమెంట్ మునుముందు చిత్రంలో కంటిన్యూ కావచ్చు. కాదనలేం..
Be first to comment on this News / Article!
|