సిమ్రాన్ పాటకు సెన్సార్ కత్తెర
తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమధ్య వరకూ ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్ లో సరైన బ్రేక్ కోసం ఎదురుతెన్నులు చేస్తోంది. ఈమధ్యనే తెలుగులో 'జాన్ అప్పారావు 40 ప్లస్', 'ఒక్కమగాడు' వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆ రెండూ ఫ్లాపులు చవిచూశాయి. దీంతో ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న 'ఐందామ్ పడై' చిత్రంపైనే సిమ్రాన్ మంచి హోప్స్ పెట్టుకుంది. ఖుష్బూ భర్త సుందర్ సి.కథానాయకుడిగా నటిస్తూ అవ్ని సినీ క్రియేషన్స్ బ్యానర్ పై సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో వారంలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా ఇందులో కీలకమైన ఓ పాటపై ఇటీవల సెన్సార్ కత్తెర పడింది. సిమ్రాన్, సుందర్ లపై చిత్రీకరించిన ఈ పాటలో శృంగార పాళ్లు ఎక్కువగా ఉండటంతో 'ఎ' సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ సభ్యులు తెగేసి చెప్పారట.
కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడాలనే ఉద్దేశంతో క్లీన్ యు కోసం దర్శకనిర్మాతలు ఆసక్తి చూపడంతో చివరకు ఆ పాటను సినిమా నుంచి తొలగించక తప్పలేదట. దీంతో 'ఐందామ్ పడై'కి క్లీన్ చిట్ లభించింది. నిజానికి ఈ పాట కోసం సిమ్రాన్ ఏకంగా 65 కాస్ట్యూమ్స్ ధరించి చాలా హాట్ గా కూడా కనిపిస్తుందట. అయితే ఆ పాట సెన్సార్ సర్టిఫికేషన్ ప్లాబ్లంతో ఇప్పుడు వెలుగుచూసే అవకాశం లేకుండా పోయింది. అన్నట్టు...సిమ్రాన్ తన సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఆమధ్య తమిళంలో నటించిన 'కిచా వయసు 16' చిత్రం ఇప్పుడు 'నా వయసు 16 ' పేరుతో తెలుగులో రాబోతోంది. 'ఐందామ్..'తో తమిళంలో 'నా వయసు..'తో సిమ్రాన్ మళ్లీ ఈ రెండు భాషల్లో బిజీ అవుతుందేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|