వేశ్య పాత్రలో అనుష్క
'అరుంధతి' చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి 'జేజమ్మ' పాత్రకు జనంతో నీరాజనాలు పట్టించుకున్న అనుష్క...ఇందుకు భిన్నంగా ఈమధ్యనే 'బిల్లా ' చిత్రంలో బికినీ అందాలతో యువతకు గాలం వేసింది. వాట్ నెక్స్ట్ అనుకునే లోగానే ఇప్పుడు మరో మరపురాని పాత్రలో ఇప్పుడు కనిపించబోతోంది. ఒకప్పుడు 'కన్యాశుల్కం'లో మహానటి సావిత్రి, 'ప్రేమాభిషేకం'లో సహజనటి జయసుధ తరహాలోనే ఇప్పుడు అనుష్క సైతం సెక్స్ వర్కర్ పాత్రలో నటించబోతోంది. ఈ పాత్రకు సృష్టికర్త మరెవరో కాదు..'గమ్యం' చిత్రంతో కొత్త తరహా చిత్రాలకు శ్రీకారం చుట్టిన జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్. తొలి చిత్రానికి భినంగా ఈసారి ఆయన యంగ్ స్టార్స్ తో 'వేదం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్, మంచు మనోజ్, హిందీ నటుడు మనోజ్ బాజ్ పేయి కూడా నటిస్తున్నారు.
స్లమ్ బాయ్ గా అల్లు అర్జున్, రాక్ స్టార్ గా మనోజ్ నటించనున్న ఈ చిత్రంలో అనుష్క కథకు కీలకమైన వేశ్య పాత్రను పోషించబోతున్నారు. తొలుత ఈ పాత్ర విషయంలో అనుష్క మీనమేషాలు లెక్కపెట్టిందనీ, అయితే అల్లు అర్జున్ సినిమాలో ఉన్నట్టు తెలియగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ క్రిష్ ఈమధ్యనే చెప్పుకొచ్చారు. సెక్స్ వర్కర్ పాత్రను అనుష్క ఓ ఛాలెంజ్ గా తీసుకుని నటించబోతోందనీ, క్రిష్ సైతం ఈ పాత్రను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దబోతున్నారనీ సమాచారం. ఈ ఏడాది 'అరుంధతి'తో అవార్డులు క్లీన్ స్పీప్ చేయనుందనే అభిప్రాయాలు పరిశ్రమలో బలంగా ఉన్న నేపథ్యంలో క్రిష్ 'వేదం'తో అనుష్క మరిన్ని అవార్డులను ముందే రిజర్వ్ చేసుకుంటుందేమో చూడాలి..
Be first to comment on this News / Article!
|