రామ్ 'గణేష్..జస్ట్ గణేష్'
రామ్ కథానాయకుడుగా స్రవంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రానికి 'గణేష్' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. దీనికి 'జస్ట్ గణేష్' అనే ట్యాగ్ లైన్ కూడా ఉండబోతోంది. గతంలో వెంకటేష్ కథానాయకుడుగా 'గణేష్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతమైంది. ఇప్పుడు రామ్ సినిమాలో ఆయన పాత్ర పేరు కూడా గణేష్ కావడంతో 'జస్ట్ గణేష్' అనేది టైటిల్ లో అదనంగా చేర్చారు. స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ కు జోడిగా
కాజల్ నటిస్తోంది.
అనాథలైన పిల్లలు, వారి సంరక్షణ చూసుకునే హీరో చుట్టూ ఈ చిత్ర కథ నడుస్తుంది. 'రెడీ' చిత్రంతో స్పైడర్ మాన్ విన్యాసాలతో చిన్నారులను రామ్ విపరీతంగా అలరించారు. ఆ తర్వాత నటించిన 'మస్కా' రామ్ కు మాస్ ఇమేజ్ ను సైతం తెచ్చిపెట్టింది. వీటిని దృష్టిలో పెట్టుకునే 'గణేష్' చిత్రాన్ని యాక్షన్, హ్యూమర్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రాజుసుందరం కొరియోగ్రఫీ అందించిన రెండు రొమాంటిక్ సాంగ్స్ ను స్విట్జర్లాండ్ లో చిత్రీకరించారు. మరో రెండు పాటలు హైద్రాబాద్ లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత శ్రీవాస్ ('లక్ష్యం' ఫేమ్) దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రానికి రామ్ కమిట్ అయ్యారు.
Be first to comment on this News / Article!
|