చరణ్ తో నటించాలనుకుంటే...
యువ కథానాయకుడు రామ్ చరణ్ ఈనెల 29న 1500 థియేటర్లలో 14 దేశాల్లో 'మగధీర'గా ప్రేక్షకుల ముందుకు సంచలనం సృష్టించడానికి రెడీగా ఉన్నారు. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన మూడో చిత్రంలో నటించడానికి కూడా రామ్ చరణ్ సమాయత్త మవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్ర బాబు ఈ చిత్రాన్ని నిర్మించన్నారు. ఈ బ్యానర్ లో ఇది 7వ చిత్రం. రామ్ చరణ్ కు జోడిగా జెనీలియా నటించనుంది. ఈ చిత్ర కథ ఎక్కువ భాగం అమెరికాలో జరుగనుండటం విశేషం. ఆసక్తికరంగా ఈ చిత్రంలో రామ్ చరణ్ తో నటించే అవకాశాన్ని అర్హులైన వారికి దర్శకనిర్మాతలు కల్పిస్తున్నారు. రామ్ చరణ్ తో కలిసి నటించాలనుకునే ఔత్సాహిక కళాకారులు తప్పనిసరిగా అమెరికాలో ఉండేవారే అయి ఉండాలి.
అందంగా ఉండి 18 నుంచి 22 ఏళ్ల లోపు వయసు ఉన్న యువతీ యువకులు, 35 నుంచి 45 లోపు ఉండే మధ్య వయస్కులు, 5 నుంచి 12 ఏళ్ల లోపు బాలలు, ఉక్కు కండరాల ఫైటర్లు తమ ఫోటోలతో (ఫుల్, మీడియం, క్లోజ్ టైప్) కూడిన బయోడాటాలను ఆర్టిస్ట్ డాట్ అంజన@జిమెయిల్ డాట్ కామ్ కు పంపవలసి ఉంటుంది.
Be first to comment on this News / Article!
|