'కలవరమాయే...' ప్లాటినం
స్వాతి, కమల్ కామరాజు జంటగా సతీష్ కాసెట్టి దర్శకత్వంలో మోహన్ మీడియో పతాకంపై మోహన్ వడ్లపట్ల నిర్మించిన 'కలవరమాయే మదిలో' చిత్రం గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శరత్ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక ఆర్టీసీ క్రాసెరోడ్స్ లోని సంధ్యా 35 ఎంఎం థియేటర్ లో సోమవారం రాత్రి జరిగింది. స్వాతి, కమల్ కామరాజు, సతీష్ కాసెట్టి, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.
సతీష్ కాసెట్టి మాట్లాడుతూ, కళాత్మక విలువలున్న మంచి చిత్రం తీయాలనే తపనతే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డామనీ, ఈ చిత్రం తమ హృదయాలను సూటిగా తాకుతున్నట్టు చూసిన వారంతా చెబుతుండటం చాలా సంతోషంగా ఉందనీ అన్నారు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయని ఆయన అన్నారు. ఎంతో నిబద్ధతతో ఈ చిత్రానికి అంతా కష్టపడ్డామనీ, ఇలాంటి మంచి సినిమాలను హిట్ చేయాల్సిన బాధ్యత ప్రేక్షకుల మీద ఉందనీ మోహన్ వడ్లపడ్ల పేర్కొన్నారు. స్వాతి మాట్లాడుతూ, సినిమా చూసిన వారంతా చాలా బాగుందని చెబుతుండటం తమను ఎంతో సంతోషంలో ముంచెత్తుతోందనీ, మ్యూజికల్ గా కూడా ఈ చిత్రం మంచి పేరు తెచ్చుకుంటోందనీ అన్నారు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ సినిమా కోసం తాము ఎన్నో కలలు కన్నామనీ, తమ కల వరమైందనీ కమల్ కామరాజు పేర్కొన్నారు. అనంతరం ఆడియో ప్లాటినం డిస్క్ ల ప్రదానం జరిగింది.
Be first to comment on this News / Article!
|