సుకుమార్ కు ఎన్టీఆర్ చెక్!
సుకుమార్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఎన్టీఆర్ పెర్సనల్ మేనేజర్. పొడవుగా గడ్డంతో ఎన్టీఆర్ కు ఎస్కార్ట్ గా కనిపించే ఈ వ్యక్తి పేరు పోలవరపు ఆనంద సుకుమార్. అలియాస్ సుక్కు. తాజగా సుకుమార్ ఎన్టీఆర్ ఆగ్రహాన్ని చవిచూశారనీ, ఇంకెప్పుడూ తనకు ముఖం చూపించవద్దంటూ ఆయనకు ఎగ్జిట్ గేట్ చూపారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో రెండ్రోజులుగా బలమైన ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేస్తూ సుకుమార్ మీడియాకి కొన్ని విషయాలు లీక్ చేశారనీ, కొద్దిరోజుల క్రితం ఓ పత్రికలో ప్రముఖంగా వచ్చిన వార్త సుకుమార్ చలవేననీ, ఈ పరిణామం సహజంగానే ఎన్టీఆర్ కు ఆగ్రహం తెప్పించిందనీ చెబుతున్నారు.
ఎన్టీఆర్ తో వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'అదుర్స్' సినిమాను కొడాలి నాని సమర్పణలో వంశీ పైడిపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతర ప్రక్రియలో నాని, వంశీపల్లి మధ్య తీవ్ర విభేదాలు వచ్చినట్టు తెలుస్తోందంటూ 'సాక్షి' పత్రికలో ఇటీవల ఓ వార్తా కథనం ప్రచురితమైంది. కొడాలి నాని, వంశీ కలిసే ఈ చిత్రాన్ని తెలుత ప్రారంభించినప్పటికీ నానిని వంశీ తప్పించి ఆ ప్రాజెక్ట్ ను తన సొంతం చేసుకున్నారనీ, నానికి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేసి సెటిల్ మెంట్ చేసుకున్నారనీ ఆ వార్తా కథనం సారాంశం. కొడాలి నాని ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించారనీ, ఇది తన పరువునకు భంగం కలిగించే విషయమనీ, ఈ వార్త ఎలా బయటకు వచ్చిందనే విషయంపై ఆరా తీశారనీ అంటున్నారు. దీంతో సుకుమార్ వ్యవహారం బయటుకు వచ్చిందట. సుకుమార్ పనిగట్టుకునే ఎన్టీఆర్ ప్రతిష్టను దిగజార్చే ప్రచారానికి దిగినట్టు తేలిందట. దీంతో ఆయనను గట్టిగా మందలించి ఇంకెప్పుడూ ముఖం చూపించడవద్దంటూ బయటకు పంపించేశారని తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|