బాలయ్య 'భీష్మ' 31 నుంచి
'జోష్' ఆడియో వేడుకలో బాలకృష్ణ గెటప్ అందర్నీ చూపుతిప్పుకోనీయకుండా చేసింది. ఆ గెటప్ ఏ సినిమా కోసం కావచ్చనే చర్చ కూడా జరిగింది. అయితే ఆ సస్పెన్స్ కు దర్శకుడు బోయపాటి శ్రీను తెరదించుతూ బాలయ్య గెటప్ తన సినిమా కోసమేనని వెల్లడించారు. దీంతో బాలకృష్ణ మరో చిత్రమైన 'భీష్మ'లో ఎలాంటి గెటప్ ఉండవచ్చనే క్యూరియాసిటీ సహజంగానే అభిమానుల్లో కనిపిస్తోంది. ఎందుకంటే...కొద్దిరోజుల తేడాతోనే ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి రాబోతున్నాయి. ఆ మాట అటుంచితే...ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకొన్న 'భీష్మ' చిత్రం ఈనెల 31 నుంచి హైద్రాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభ కానుంది. బాలకృష్ణ కథానాయకుడుగా 'చెన్నకేశవ రెడ్డి' 'లక్ష్మీ నరసింహా' చిత్రం తర్వాత మళ్లీ ఆయనతో బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెల్లంకొండకు ఇటీవల 'రైడ్' వంటి హిట్ చిత్రాన్ని ఇచ్చిన రమేష్ వర్మ ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.
నటరత్న ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రం 'భీష్మ'కూ ఈ చిత్రానికి పోలికలు ఉండవనీ, ఇది పూర్తిగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందనీ బెల్లంకొండ సురేష్ ముందే తెలియజేశారు. పురాణకాలం నాటి భీష్ణుడు ఆజన్మ బ్రహ్మచారి కాగా, బాలయ్య 'భీష్మ'లో మాత్రం ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు. నయనతార, భూమిక ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అగ్రిమెంట్ చేశారనీ, మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉందనీ తెలుస్తోంది. అయితే నెలాఖరులో జరిగే ప్రారంభోత్సవంలో హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు, విడుదల తేదీని కూడా బెల్లంకొండ ప్రకటించనున్నారు.
Be first to comment on this News / Article!
|