ప్రభాస్ 'డార్లింగ్' వెయిటింగ్
'బిల్లా'తో మళ్లీ సక్సెస్ బాట పట్టి 'ఏక్ నిరంజన్'గా రాబోతున్న ప్రభాస్ ఈసారి రొమాంటిక్ హీరోగా కనిపించబోతున్నారు. ప్రేమకథా చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించి మెప్పించగలగిన కరుణాకరన్ ప్రస్తుతం ప్రభాస్ తో 'డార్లింగ్' చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ తో గతంలో 'ఛత్రపతి' వంటి సెన్సేషన్ హిట్ ను అందించిన బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మించనున్నారు. జూన్ 12న పూజా కార్యక్రమాలు జరుపుకొన్న ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ లో అడుగుపెట్టనుంది.
'ఉల్లాసంగా ఉత్సాహంగా' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. 'బుజ్జిగాడు' చిత్రంలో ప్రభాస్ నోట పాపులర్ అయిన 'డార్లింగ్' అనే డైలాగ్ నే టైటిల్ గా తీసుకుని యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని కరుణాకరన్ తెరకెక్కించబోతున్నారు. ప్రభాస్ కు జోడిగా తొలిసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది. తమిళ నటుడు ప్రభు ఓ కీలక పాత్ర పోషించనున్నారు. సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆండ్రూస్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ ఫైట్స్, ఎ.ఆర్.రెహ్మాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|