గీతారెడ్డికి దాసరి సారె...
హైదరాబాద్ : సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా అంతా భావించే దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు బుధవారంనాడు తన స్వగృహంలో రాష్ట్ర టూరిజం, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీమతి గీతారెడ్డికి ఆత్మీయ ఆతిథ్యాన్ని అందించారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దాసరి ఇంటికి విచ్చేసిన గీతారెడ్డికి దాసరి దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు స్వాగతం పలికారు. విందు అనంతరం గీతారెడ్డి అడపడుచు లాంఛనంగా నూతన వస్త్రాలు, తాంబాలాలను దాసరి దంపతులు అందజేశారు. దాసరి దంపతులు చూపించిన ఆదరాభిమానాలు, పరిశ్రమ ప్రముఖుల అభిమానం తాను ఎప్పటికీ మరచిపోలేనని గీతారెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దాసరి నివాసంలో గీతారెడ్డిని కలుసుకుని ఆమెకు ఆత్మీయ ఆహ్వానం పలికిన వారిలో డి.వి.ఎస్.రాజు, డాక్టర్ ఎం.మోహన్ బాబు, జయసుధ, రమేష్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, డి.సురేష్ బాబు, జి.హనుమంతరావు, కె.ఎస్.రామారావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Be first to comment on this News / Article!
|