నంది అవార్డుల కమిటీ
తెలుగు సినీ పరిశ్రమ పండుగగా భావించే నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ఏటా నిర్వహిస్తూ వస్తోంది. 2008 సంవత్సరానికి గాను నంది అవార్డుల ఎంపికకు 16 మంది సభ్యులతో కూడిన ప్యానల్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. నామినేషన్ల స్క్రీనింగ్ అనంతరం కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది. అనంతరం అవార్డుల ప్రకటన వెలువడుతుంది. ఈసారి నంది అవార్డుల కమిటీకి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సారథ్యం వహించనున్నారు. ఆయన ఆధ్వర్వంలో ఫ్యానల్ సభ్యులు వివిధ కేటగిరిలలో అవార్డు విజేతలను ఎంపిక చేస్తారు. ఈసారి ప్యానల్ లో పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు థియేటర్, ఆర్ట్స్ రంగాలను చెందిన వారికి కూడా చోటు కల్పించారు. మహిళా సభ్యులు సైతం గణనీయంగానే ఉన్నారు.
కమిటీ సభ్యులలో తమ్మారెడ్డి భరద్వాజ (దర్శకనిర్మాత), కె.సి.శేఖర్ బాబు (నిర్మాత), డివిఎన్ రాజు (నిర్మాత), జి.మంజుల (నటి, నిర్మాత, మహేష్ సోదరి), రోజారమణి (నటి, డబ్బింగ్ ఆర్టిస్టు, తరుణ్ తల్లి), రామిరెడ్డి (నటుడు), ఎం.పూర్ణచంద్ర (మ్యూజిక్), రాళ్లపల్లి (నటుడు), వడ్డేపల్లి కృష్ణ (గేయ రచయిత), సుమ కనకాల (టీవీ యాంకర్, సినీ నటి), చల్లా శ్రీనివాస్ (సినీ జర్నలిస్ట్), దీపిక రెడ్డి (కూచిపూడి నర్తకి), మంగా రెడ్డి (డిజైనర్), బి.వి.పట్టాభిరామ్ (మెజిషియన్, హిప్నటిస్ట్, రచయిత), ఎం.కె.ఆర్.ఆశాలత (అనౌన్సర్), పార్థసారధి ఉన్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|