నాని హీరోగా 'చిచ్చా'
'అష్టాచమ్మ'తో తొలి హిట్ కొట్టి, ఇటీవల విడుదలైన 'రైడ్' చిత్రంతో యూత్ హాట్ ఫేవరెట్ గా మారిన నాని ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీ అవుతున్నారు. సత్యం బెల్లంకొండ దర్శకత్వంలో నాని నటించిన 'స్నేహితుడా' చిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా నాని మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. నాని కథానాయకుడుగా రూపొందనున్న ఈ చిత్రానికి 'చిచ్చా' అనే టైటిల్ నిశ్చయించారు. 'రైడ్' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన రవి ఉప్పలపాటి 'గ్రీన్ లీవ్స్ ఎంటర్ టైన్ మెంట్స్' పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విజయ్ అనే కొత్త దర్శకుని ఈ చిత్రంలో పరిచయం చేయనున్నారు.
నానికి జోడిగా మధురిమ ('ఆ ఒక్కడు' ఫేమ్) ఎంపికైంది. యాక్షన్ తో కూడిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. హేమచంద్ర సంగీతం అందించనున్న ఈ చిత్రం ఆగస్టులో సెట్స్ పైకి రానుంది. కాగా, గ్రీన్ లీవ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మురళీకృష్ణ ('మల్లెపూవు' ఫేమ్) హీరోగా 'రవిగాడు' అనే మరో చిత్రాన్ని కూడా కూడా రవి ఉప్పలపాటి ప్రకటించారు. 'రైడ్' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఉదయ్ నందనవనం ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరచయం కాబోతున్నారు. షీలా ('పరుగు' ఫేమ్) కథానాయికగా నటించనుంది. ఈనెలాఖరులోనే ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది.
Be first to comment on this News / Article!
|