'విలేజ్ లో వినాయకుడు' పూర్తి
'వినాయకుడు' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న 'విలేజ్ లో వినాయకుడు' చిత్రం 36 రోజుల పాటు జరిగిన సింగిల్ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకుంది. 'వినాయకుడు' ఫేమ్ కృష్ణుడు, నూతన కథానాయిక శరణ్య మోహన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. 'వినాయకుడు' చిత్రానికి దర్శకత్వం వహించిన సాయికిరణ్ అడవి ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో మూన్ వాటర్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించారు.
'విలేజ్ లో వినాయకుడు' చందమామ పుస్తకంలో కథలాగా ఉంటుందనీ, కేవలం 36 రోజుల పాటు రాజోలు, ఆ పరిసర ప్రాంతాల్లో జరిపిన షూటింగ్ తో ఐదు పాటలతో సహా టాకీ మొత్తం పూర్తయిందనీ సాయికిరణ్ అడవి తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించామనీ, అతి త్వరలోనే ఆడియో, సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రావు రమేష్, జోగినాయుడు, ప్రత్యేక పాత్రలో యండమూరి వీరేంద్రనాథ్ తదితరులు నటిస్తున్నారు. మహి కథ, వనమాలి పాటలు, రమణ సాల్వా సినిమాటోగ్రఫీ, రాజీవ్ నాయర్ ఆర్ట్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, మణికాంత్ ఖాద్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|