'భీష్మ'లో పార్వతి మెల్టన్?
'జల్సా' తర్వాత పార్వతి మెల్టన్ ఏం చేస్తోంది? ఏడెనిమిది నెలలకు పైగా జరుగుతున్న చర్చ ఇది. మనస్థాపంతో అమెరికా వెళ్లిపోయి ఈ మధ్యనే టాలీవుడ్ కు తిరిగి వచ్చిన పార్వతి వద్ద ఇందుకు స్పష్టమైన సమాధానమే ఉంది. 'అమ్మ ఆరోగ్యం బాగోలేక ఆమధ్య అమెరికా వెళ్లాను. ఇప్పుడు ఆమెకు పూర్తి స్వస్థత చేకూరింది. దీంతో మళ్లీ యాక్టింగ్ వైపు దృష్టిసారిస్తున్నాను. ఒక బిగ్ బ్యానర్ లో టాప్ హీరో సరసన త్వరలోనే నటించబోతున్నాను' అని పార్వతి ఈమధ్యే అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆ బ్యానర్, టాప్ హీరో ఎవరనే సస్పెన్స్ కు తెరపడింది. బెల్లంకొండ సురేష్ బ్యానర్ లో బాలకృష్ణ కథానాయకుడిగా సెట్స్ పైకి రానున్న 'భీష్మ' చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా పార్వతి నటించనుందని సమాచారం.
'చెన్నకేశవరెడ్డి', 'లక్ష్మీనరసింహా' చిత్రాల తర్వాత మళ్లీ బాలకృష్ణతో 'భీష్మ' చిత్రాన్ని బెల్లంకొండ సురేష అనౌన్స్ చేశారు. ఇటీవలే బెల్లంకొండ తీసిన 'రైడ్' చిత్రానికి దర్శకుడైన రమేష్ వర్మ ఈ తాజా చిత్రానికి సైతం దర్శకత్వం వహించనున్నారు. ఇందులో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు. తొలుత నయనతార, భూమిక పేర్లు వినిపించినప్పటికీ ఇప్పడు పార్వతి మెల్టన్ పేరు జోరుగా వినిపిస్తోంది. మహేష్ సరసన 'వరుడు' చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో ఆ పాత్రను అనుష్క తన్నుకుపోవడంతో అలిగిన పార్వతి ఇప్పుడు 'టాప్ హీరో' బాలకృష్ణతో నటించే అవకాశం రావడంతో ఒకింత టెన్షన్ గానే ఉందని తెలుస్తోంది. మళ్లీ చివరి నిమిషంలో మార్పులు జరగకుంటే పార్వతికి ఇది సరైన బ్రేక్ నిచ్చే ప్రాజెక్ట్ కావచ్చు. ఈనెల 31న ఈ చిత్రం అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. అదే రోజు హీరోయిన్లు, సాంకేతిక నిపుణులతో పాటు సినిమా విడుదల తేదీని కూడా బెల్లకొండ అనౌన్స్ చేయబోతున్నారు.
Be first to comment on this News / Article!
|