తరుణ్ 'చక్కనైన అబ్బాయి'
లవర్ బాయ్ ఇమేజ్ ను తరుణ్ ఇప్పటికై రిటైన్ చేసుకుంటున్నారు. 'నువ్వేకావాలి', 'నువ్వు నాకు నచ్చావ్' అంటూ యూత్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ ఆ తర్వాత చెప్పుకోదగిన హిట్లు లేకపోయినా ఈమధ్యనే 'శశిరేఖా పరిణయం'తో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. యావరేజ్ తోనే ఆ చిత్రం సరిపుచ్చుకుంది. తరుణ్ ఇప్పుడు మరోసారి లవర్ బాయ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రణవ్ స్టూడియోస్ సమర్పణలో సుప్రీం మూవీస్ బ్యానర్ పై రాజు హిర్వాణి మరో నిర్మాత జి.శ్రీనివాసరావుతో కలిసి నిర్మిస్తున్నారు. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటూ తుది మెరుగుల దశలో ఉంది. ఈ చిత్రానికి 'చుక్కలాంటి అబ్బాయి చక్కనైన అమ్మాయి' అనే టైటిల్ అనుకుంటున్నారు.
ఇండియా, థాయ్ లాండ్ బ్రాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. తరుణ్ కు జోడిగా విమలా రామన్ ('ఎవరైనా ఎపుడైనా' ఫేమ్) నటిస్తోంది. ఈ చిత్రం హైద్రాబాద్, మలేసియాలో కీలక షెడ్యూల్స్ జరుపుకొంటోంది. ఈ చిత్రానికి గంగోత్రి విశ్వనాథ్ మాటలు, ఎస్.అరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|