'ఆంజనేయులు' ఆడియో
రవితేజ, నయనతార జంటగా పరశురామ్ ('యువత' ఫేమ్) దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం 'ఆంజనేయులు'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని తాజ్ డక్కనే హోటల్ లో శుక్రవారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ దాసరి నారాయణరావు ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి మరో అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి బొత్సా సత్యనారాయణకు అందజేశారు. సీడీని మురళీమోహన్ ఆవిష్కరించి డి.సురేష్ బాబుకు అందించారు. ఎమ్మెల్యే లు ఘంటా శ్రీనివాసరావు, ప్రతాప్ రెడ్డితో పాటు గణేష్, పరశురామ్, వి.వి.వినాయక్, మెహర్ రమేష్, ఎస్వీకృష్ణరెడ్డి, అచ్చిరెడ్డి, కె.ఎస్.రామారావు, డాక్టర్ కె.ఎల్.నారాయణ, సి.కల్యాణ్, జయంత్, రవితేజ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, బ్రహ్మాజీ, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, పరుచూరి వెంకటేశ్వరరావు, తమన్, ఏవీయస్ తదితరులు పాల్గొన్నారు. థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ, గణేష్ ను మొదట చూసినప్పుడు అతనిలో మంచి నటుడి కన్నా మంచి వ్యాపారవేత్త ఉన్నాడనిపించిందనీ, నిర్మాతగా మారి తీసిన తొలిచిత్రం విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ పొందటం అభినందించదగిన విషయమని అన్నారు. 'మా' సభ్యుడైన గణేష్ సినిమా తీసి నిర్మాతగా మారడం ఆనందంగా ఉందనీ, ఈ చిత్రంతో నిర్మాతగా అతను మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాననీ మురళీ మోహన్ పేర్కొన్నారు. ఇది తనకు రెండో సినిమా వేడుకనీ, ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ మంత్రి బొత్సా అన్నారు. గణేష్ లో నిర్మాత ఉన్న విషయం తనకు తెలియదనీ, అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాననీ ఎస్.వి.కృష్ణారెడ్డి అన్నారు. కమెడియన్లలో నిర్మాతగా మారి సినిమా తీసిన వాళ్లలో గణేష్ మొదటివాడని పరుచూరి వెంకటేశ్వరరావు, బ్యానర్, నిర్మాత పేరు రెండూ బాగున్నాయని కోట అభినందించారు. బావ రవితేజ మంచి సక్సెస్ లో ఉన్నప్పుడు రూపొందించిన చిత్రమిదనీ, అలాగే పరశురామ్ మంచి ప్రతిభ గల దర్శకుడనీ, ఈ చిత్రం ఇటు నిర్మాతకు, అటు సంగీత దర్శకుడు థమన్ కు కూడా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాననీ వినాయక్ అన్నారు. అచ్చిరెడ్డి, సురేష్ బాబు, బహ్మానందం తదితరులు 'ఆంజనేయులు' విజయం సాధించాలని అభిలషించారు.
Be first to comment on this News / Article!
|