మగధీర' 31కి వాయిదా
రామ్ చరణ్ తేజ 'మగధీర' చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మరో స్వల్ప నిరీక్షణ తప్పడం లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కావలసి ఉండగా, అందుబాటులో ఉన్న ప్రస్తుత సమాచారం ప్రకార మరో రెండు రోజులు ఆలస్యంగా ఈనెల 31న ఈ చిత్రం విడుదల కాబోతోంది. డిజిటల్ ఇంటర్మీడియట్, గ్రాఫిక్ వర్క్ కారణంగా ఈ జాప్యం చోటుచేసుకున్నట్టు తెలిసింది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి షూటింగ్ వర్క్ పూర్తి చేసిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో తలమునకలవుతున్నారు. ఇదే సమయంలో అత్యధిక ప్రింట్లకు, వాటిని సకాలంలో ఓవర్ సీస్ కు పంపేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.
సినిమా విడుదలకు ముందే 'మగధీర' రికార్డులు షురూ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో 1500 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ రైట్స్ తీసుకున్న సుప్రీం మ్యూజిక్ అధినేత రాజు హిర్వాణి ఈనెల 31న 25 ప్రింట్లతో 45 థియేటర్లలో ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్నారు. 30వ తేదీన అమెరికాలో ప్రీమియర్ షోలకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. 400 ఏళ్ల నాటి నుంచి నేటి వరకూ జరిగే సంఘటనలతో పీరియాడిక్ ఫిల్మ్ గా 'మగధీర' ఉండబోతోంది. నాటి జన్మలో ప్రేమను పొందలేకపోయిన యువజంట ఈ జన్మలో మళ్లీ పుట్టి తమ ప్రేమను సార్థకం చేసుకుంటారు. అప్పుడు విడిపోయిన ప్రేమజంటను ఇప్పుడు కలిపే వ్యక్తిగా శ్రీహరి ద్విపాత్రభినయం చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ రాకుమారుడుగా, నేటి జన్మలో ఫైట్ మాస్టర్ గా, కాజల్ ప్రినెస్స్ గా, కాలేజీ అమ్మాయిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలనాటి 'బంగారు కోడిపెట్ట' సాంగ్ ను ఈ చిత్రంలో రీమిక్స్ సాంగ్ గా చిత్రీకరించడం, ఇందులో రామ్ చరణ్ తో పాటు చిరంజీవి స్టెప్స్ వేయడం విశేషం. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఇప్పటికే ఆడియో ఛార్ట్స్ లో టాప్ ప్లేస్ లో ఉంది.
Be first to comment on this News / Article!
|