నాగార్జున సినిమా ప్రారంభం
'కింగ్' చిత్రం విడుదలైన ఆరు నెలలు దాటింది. ఈ గ్యాప్ లో నాగార్జున తన కుమారుడు నాగచైతన్యను వెండితెరకు పరిచయం చేస్తున్న 'జోష్' చిత్రంపై తన దృష్టి సారిస్తూ వచ్చారు. ఇప్పుడు 'జోష్' ఆడియో విడుదల కూడా జరుపుకొని ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నాగార్జున మళ్లీ తన కొత్త ప్రాజెక్ట్ వైపు మళ్లారు. నాగార్జున తదుపరి చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో శుక్రవారంనాడు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'కింగ్' చిత్రాన్ని నిర్మించిన కామాక్షి కళా మూవీస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి మరోసారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ అనే కొత్త యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జరిగిన పూజా కార్యక్రమంలో నాగార్జున, కిరణ్, అక్కినేని నాగేశ్వరరావు, దిల్ రాజు పాల్గొన్నారు. మీడియాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు.
ఈనెలలోనే గుంటూరులో నాలుగు రోజుల పాటు షూటింగ్ జరుపుకొని ఆ తర్వాత హైద్రాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
Be first to comment on this News / Article!
|