నవదీప్-కాజల్ చిత్రం షురూ
హీరో నవదీప్, హీరోయిన్ కాజల్ కెరీర్ లో కృష్ణవంశీ 'చందమామ' చిత్రానికి ప్రత్యేకత ఉంది. అంతవరకూ హిట్లు లేని నవదీప్ కు తొలిసారి ఆ చిత్రం సరైన హిట్ ను అందిస్తే, రెండు మూడు చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాని కాజల్ కు సరైన బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రం తర్వాత కాజల్ బిజీ హీరోయిన్ గా మారి రామ్ చరణ్ 'మగధీర', అల్లు అర్జున్ 'ఆర్య 2', రామ్ 'గణేష్...జస్ట్ గణేష్' చిత్రాల్లో నటిస్తోంది. అలాగే నవదీప్, కాజల్ ప్రధాన జంట కాకపోయినా మరోసారి అల్లు అర్జున్ 'ఆర్య-2'లో ఇద్దరూ నటిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ఇప్పుడు నవదీప్-కాజల్ జంటతో మరో కొత్త చిత్రం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ ఇద్దరూ కలిసి నటించనున్న చిత్రాన్ని అశ్వనీదత్ ముగ్గురు కుమార్తెలు కలిసి 'త్రీ ఏంజెల్స్' బ్యానర్ పై నిర్మించబోతున్నారు. హైద్రాబాద్ లోని త్రీ ఏంజెల్స్ కార్యాలయంలో శుక్రవారంనాడు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి.
నవదీప్-కాజల్ తో పాటు ఈ కొత్త చిత్రంలో నిఖిల్ ('యువత' ఫేమ్), బిందు మాధవి ('ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్) మరో జంటగా నటించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|