పూరీ ఆకాష్ పెద్ద మనసు
పూరీ జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ బాలనటుడిగానే కాకుండా పదేళ్ల ప్రాయంలోనే తనలోని దాతృత్వాన్ని కూడా చాటుకున్నాడు.ఆకాష్ తన పుట్టినరోజును శనివారంనాడు పలువురు విద్యార్థుల సమక్షంలో బంజారాహిల్స్ లోని వివేకానంద స్కూలులో జరుపుకొన్నాడు. ఇందులో భాగంగా ఐదుగురు పేద విద్యార్థులు చదువుకునేందుకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాడు.
పుట్టినరోజునాడు పిల్లలందరూ ఎక్కడికైనా బయటకు వెళ్లి బర్త్ డే చేసుకోవాలని అనుకుంటారనీ, తాను తన ఈడు పిల్లల మధ్య జరుపుకోవాలని అనుకున్నాననీ ఆకాష్ తెలిపాడు. తాను ప్రస్తుతం నటిస్తున్న 'లోటస్ పాండ్' చిత్రానికి గాను తీసుకున్న కొంత పారితోషికాన్ని పేద విద్యార్థుల చదువు కోసం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అందరు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తే మరింత మంది పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. ఆకాష్ బాలనటుడిగా 'చిరుత', 'బుజ్జిగాడు' చిత్రాల్లో చిన్నప్పటి పవన్ కల్యాణ్, ప్రభాస్ గా నటించి మెప్పించాడు. ప్రస్తుతం పి.జి.విందా దర్శకత్వంలో ఇన్నోవేషన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న అంతర్జాతీయ చిత్రం 'లోటస్ పాండ్'లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
Be first to comment on this News / Article!
|