ఛాంబర్ కు బాలకృష్ణారావు
ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (2009-1010)కు జరిగిన ఎన్నికలో ఛాంబర్ అధ్యక్షుడుగా ఉషా పిక్చర్స్ (ఏలూరు) అధినేత, ప్రముఖ పంపిణీదారుడు వి.వి.బాలకృష్ణారావు ఎన్నికయ్యారు. ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు, ఇద్దరు గౌరవ కార్యదర్శులు, ఆరుగురు గౌరవ ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, సెక్టార్ కౌన్స్ చైర్మన్లు, ఎగ్జిక్యూటివ కమిటీ మెంబర్ల ఎంపిక కూడా జరిగింది.
గౌరవ కార్యదర్శులుగా కె.సి.శేఖర్ బాబు, టి.సాయి సూర్యప్రసాద్ ఎన్నికయ్యారు. గౌరవ ప్రధాన కార్యదర్శులుగా జె.వి.మోహన్ గౌడ్, టి.సుబ్రమణ్యం, వి.వి.రామకృష్ణ, జి.మహేశ్వర్ రెడ్డి, కె.వంశీ కిషోర్, ఎ.గౌతంరెడ్డి, కోశాధికారిగా బి.శివరామకృష్ణ ఎన్నికయ్యారు. నిర్మాతల సెక్టార్ చైర్మన్ గా ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ కు వి.నాగేశ్వరరావు, ఎగ్జిబిటర్స్ సెక్టార్ కు పి.ఎస్.భాస్కరరావు, స్టూడియో సెక్టార్ కు ప్రదీప్ కె షా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఎంపికైన 30 మందిలో అల్లు అరవింద్, సిఎన్ రావు, పి.కిరణ్, జి.వి.హెచ్.ప్రసాద్, ఎస్.వి.రావు, పి.సత్యానారాయణ, డి.సురేష్ బాబు, వి.వెంకటరమణా రెడ్డి, జి.ఆదిశేషగిరిరావు, డి.రామానాయుడు, ఎ.రమేష్ ప్రసాద్, డి.అప్పారావు, ఎం.రాందాస్, వి.దొరస్వామి రాజు, ఎ.బ్రహ్మారెడ్డి, సునీల్ నారంగ్, వి.వీరినాయుడు, వి.పద్మాకరరావు, కె.అప్పలరాజు, ఎన్ వివి బంగార్రాజు, ఆర్.వి.భూపాల్ ప్రసాద్, ఎన్.బుచ్చయ్య, డి.చక్రపాణి, సి.హెచ్.గోవర్దన్, కె.మురళీమోహన్, జి.నాగేశ్వరరావు, టి.ఎస్.రామ్ ప్రసాద్, బి.వి.రమణయ్య, బి.వేంకటేశ్వరరావు, ఎం.విజయేందర్ రెడ్డి ఉన్నారు.
Be first to comment on this News / Article!
|