'స్కై డైవ్'లో చరణ్ శిక్షణ
'చిరుత'తో ఇటు డాన్సులు, ఫైట్స్ లో చిచ్చరపిడుగు అనిపించుకున్న రామ్ చరణ్ తేజ ఇప్పుడు 'మగధీర'లో కత్తి ఫైట్లు, గుర్రపుస్వారిలో తనకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించబోతున్నారు. హార్స్ రైండింగ్ లో రామ్ చరణ్ కు ఉన్న స్కిల్స్ తనను అబ్బురపరుస్తూ, ఒకింత అసూయను కూడా కలిగిస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నవ్వుతూ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ గుర్రపుస్వారీని చూసి తానుకూడా సెట్స్ లో హార్స్ రైడింగ్ చేసినట్టు దర్శకుడు రాజమౌళి కూడా ఎంతో ఎగ్జయిటింగ్ గా చెప్పుకొచ్చారు. చరణ్ ఆరేడేళ్ల ప్రాయంలోనే చెన్నైలోని హార్స్ రైడింగ్ క్లబ్ లో శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు చరణ్ తన తదుపరి చిత్రంలో మరో స్కిల్ చూపించబోతున్నారు. చరణ్ మూడో చిత్రాన్ని 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై నాగేంద్రబాబు నిర్మించనున్నారు. జెనీలియా కథనాయిక. అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో నటించేందుకు అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ కళాకారుల ఎంపిక కూాడ జరుగుతోంది. ఈ చిత్రం కోసమే చరణ్ 'స్కై డైవ్'లో శిక్షణ తీసుంటున్నారు.
చరణ్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, రొటీన్ కథాంశాలకు భిన్నంగా ఓ మంచి లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేయమని భాస్కర్ ను కోరడం, అలాగే ఆయన మంచి స్క్రిప్టు రెడీ చేయడం జరిగిందనీ తెలిపారు. తానూ, జెనిలియా, మరో క్యారెక్టర్ చుట్టూ ఈచిత్ర కథ నడుస్తుందనీ చెప్పారు. ఇందుకోసం తాను స్కై డైవ్ నేర్చుకుంటున్న విషయం నిజమేననీ, అయితే ఇంకా అందులో ఫెర్ ఫెక్షన్ సాధించలేదనీ చెప్పుకొచ్చారు. సినిమాలోని ఎక్కువ భాగం న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకొంటుందని చెప్పారు. సో...చరణ్ తదుపరి చిత్రంలోని ఆయన పాత్ర పూర్వాపరాలు కొద్దిగా బయటకు వచ్చినట్టే.
Be first to comment on this News / Article!
|