కమలిని అరుదైన రికార్డు
'ఆనంద్' చిత్రంలో రూప పాత్ర పోషణతో మరో సావిత్రి, సౌందర్య పరిశ్రమకు లభించిందంటూ కమలిని ముఖర్జీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కూడా ఆమె గ్లామర్ పాత్రల కంటే పెర్ ఫారమెన్స్ గా ప్రాధాన్యం ఇస్తూ విలక్షణ నటిగా అనిపించుకుంటోంది. ఆ క్రమంలోనే 'గమ్యం' చిత్రంలో డాక్టర్ జానకి పాత్ర ఆమెకు మరో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ చిత్రాన్ని ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేశారు. ఆ రెండు భాషల్లో నూ కమిలిని ముఖర్జి జానకి పాత్రను పోషించి మెప్పించారు. తాజాగా ఆమె నాలుగో సారి కూడా జానకి పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి కమలిని మాతృభాష బెంగాలీలో ఈ చిత్రం రూపొందుతుండటం విశేషం. బెంగాలీ వెర్షన్ లో మిధున్ చక్రవర్తి తో కలిసి కమలిని నటించనుంది.
సహజంగా ఒక భాషలో హిట్టయిన సినిమాను వేరే భాషల్లో తీయడం సహజమే అయినా మాతృకలో నటించిన హీరోయిన్ నే మిగతా భాషల్లో ప్రిఫర్ చేయడం అరుదు. గతంలో చిరంజీవి 'ఖైదీ' చిత్రంలో నటించిన సుమలత నాలుగు భాషల రీమేక్ ల్లోనూ నటించింది. అయితే ఆ చిత్రంలో సుమలత ప్రధాన హీరోయిన్ కాదు. డాక్టర్ గా ఓ కీలక పాత్ర మాత్రమే పోషించారు. ఇప్పుడు ఆ రికార్డును కమలిని సమం చేసింది. కాకపోతే కథానాయికగా ఆ రికార్డు కమలినికి దక్కుతోంది. అన్నట్టు 'గమ్యం' చిత్రానికి గాను కమలిని 2008 'ఐడియా ఫిలింఫేర్ అవార్డ్స్' ఉత్తమనటి బరిలో ఉన్నారు.
Be first to comment on this News / Article!
|