'యూత్ రాక్స్' ఆటాపాటా
అక్కినేని నాగచైతన్య కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం 'జోష్'. దీనికి యాత్ రాక్స్ అనేది ట్యాగ్ లైన్. వాసువర్మ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న తొమ్మిదో చిత్రమిది. తాజాగా ఈ చిత్రం కోసం స్విట్జర్లాండ్ లో ప్రధాన జంటపై ఓ పాట చిత్రీకరిస్తున్నామనీ, నిర్మాణాంతర పనులు కూడా చాలా వరకూ పూర్తయ్యాయనీ దిల్ రాజు తెలిపారు.
యుత్ ఫుల్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందనీ, హీరోగా నాగచైతన్యను, దర్శకుడిగా వాసువర్మను, రాధ కుమార్తె కార్తీకను హీరోయిన్ గా ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. సందీప్ చౌతా సంగీతం, సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని చెప్పారు. ఇటీవల విడుదలైన ఆడియోకు విశేషమైన స్పందన లభిస్తున్నట్టు తెలిపారు. సిట్జర్లాండ్ లో సాంగ్ తర్వాత మరో సాంగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించడంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందన్నారు. నాగచైతన్యను పరిచయం చేసే బాధ్యతను నాగార్జున అప్పగించారనీ, అందుకు తాము పూర్తి న్యాయం చేసినట్టు అనుకుంటున్నామనీ అన్నారు. 'జోష్'తో తమ బ్యానర్ లో మూడో హ్యాటిక్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టులో సినిమా విడుదలకు ప్లానింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జె.డి.చక్రవర్తి, బ్రహ్మానందం, సితార, ఆనంద్, సూర్య, పలువురు కొత్తతారలు నటిస్తున్నారు. సీతారమశాస్త్రి-చంద్రబోస్ పాటలు, వాసువర్మ మాటలు, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|