ప్రభాస్ 'మిస్టర్ పెర్ ఫెక్ట్'
'బిల్లా'తో మళ్లీ మంచి ఫామ్ లోకి వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఒప్పుకుంటున్న సినిమాలు చూస్తే మరో ఏడాది వరకూ ఆయన డైరీ ఫుల్ అనే చెప్పాలి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఏక్ నిరంజన్' చిత్రం షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్నారు.ఈ చిత్రం తర్వాత 'ఛత్రపతి' ప్రసాద్ (బివిఎస్ ఎన్ ప్రసాద్) నిర్మాతగా కరుణాకరన్ దర్శకత్వంలో 'డార్లింగ్' చిత్రానికి కమిట్ అయ్యారు. పూరీ జగన్నాథ్ సినిమా పూర్తి కాగానే ఈ చిత్రానికి ఆయన షిఫ్ట్ అయిపోతారు. సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత దిల్ రాజు సినిమా కూడా క్యూలో ఉంది. దశరథ్ ('సంతోషం' ఫేమ్) దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతోంది. తాజాగా సురేందర్ రెడ్డి తదుపరి చిత్రానికి కూడా ప్రభాస్ పచ్చజెండా ఊపినట్టు ఫిల్మ్ సర్కిల్ సమాచారం.
'అతనొక్కడే', 'అశోక్', 'అతిథి' చిత్రాల తర్వాత సురేందర్ రెడ్డి ఇటీవల రవితేజ హీరోగా 'కిక్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించారు. తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పై కూడా ప్రభాస్ తో డిస్కషన్స్ జరిపినట్టు సమాచారం. దీనికి 'మిస్టర్ పెర్ ఫెక్ట్' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. ప్రభాస్ సైతం వీలువెంబడి సురేందర్ రెడ్డికి డేట్లు అడ్జెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అన్నట్టు...సురేందర్ రెడ్డి తదుపరి చిత్రం సాయికుమార్ తనయుడిని హీరోగా పరిచయం చేసే చిత్రమవుతుందని ప్రచారం జరిగినా మళ్లీ ఆ ఊసేలేదు.
Be first to comment on this News / Article!
|