పవన్-హరీష్-గణేష్
పవన్ కల్యాణ్ కథానాయకుడుగా పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో 'ప్రొడక్షన్ నెంబర్ 1' చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ప్లాన్ చేసిన నటుడు-నిర్మాత గణేష్ బాబు ఇప్పుడు 'ప్రొడక్షన్ నెంబర్ 3'గా పవన్ కల్యాణ్ తోనే మరో చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ ('షాక్' ఫేమ్) దర్శకత్వంలో భారీ స్థాయిలో నిర్మించనున్నట్టు గణేష్ తెలిపారు. ఇదే బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2గా రవితేజతో గణేష్ నిర్మించిన 'ఆంజనేయులు' చిత్రం ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది.
పవన్-హరీష్ కాంబినేషన్ చిత్రం గురించి గణేష్ బాబు వివరిస్తూ, తమ బ్యానర్ లో పవన్ కల్యాణ్ సినిమా చేస్తుండటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పవన్ ను దృష్టిలో పెట్టుకుని హరీష్ శంకర్ అద్భుతమైన సబ్జెక్ట్ రెడీచేశారనీ, కథ వినగానే పవన్ ఎంతో ఇంప్రెస్ అయి ఈ చిత్రం చేయడానికి అంగీకరించారని తెలిపారు. పవన్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్ నే ఇందులో ఆయన పోషించనున్నారనీ, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ ఎత్తున ఈ చిత్రం ఉంటుందన్నారు. త్వరలోనే సినిమా ప్రారభించి 2010 సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తామన్నారు.
Be first to comment on this News / Article!
|