'రణధీర'గా జాకీచాన్ కొడుకు
హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ హీరో జాకీచాన్ తనయుడు జైసి చాన్ కూడా ఇప్పుడు హీరో ఆయ్యారు. ఆయన కథానాయకుడుగా పరిచయమైన హాలీవుడ్ యాక్షన్ చిత్రం 'ఎం.ఐ.4 : ఇన్విజబుల్ టార్గెట్'. దీనికి జెన్నీచాన్ ('న్యూ పోలీస్ స్టోరీ' ఫేమ్') దర్శకుడు. పికాక్ ఇంటర్నేషనల్ పతాకంపై మాస్టర్ అమాన్ సమర్పణలో నిర్మాత జమ్ము ఈ చిత్రాన్ని 'రణధీర' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామనీ నిర్మాత జమ్ము తెలిపారు.
చాకీజాన్ చిత్రాలంటే ఇష్టపడని ప్రేక్షకులు ఉండరనీ, ప్రపంచ దేశాల్లో ఆయన సాహసాలకు వివపరీతమైన క్రేజ్ ఉందని అన్నారు. ఇప్పుడు జాకీచాన్ తనయుడు జైసిచాన్ సైతం తండ్రికి మించిన తనయుడిగా హాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం చూరగొంటున్నారని తెలిపారు. కోట్లాది రూపాయలు ఉన్న క్యాష్ ట్రక్ ను దోపిడీ చేసిన గ్యాంగ్ ను పట్టుకునే ముగ్గురు పోలీసు అధికారులతో సాహసాలతో ఈ చిత్రం రూపొందిందనీ, జైసిచాన్ యాక్షన్ ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తుందనీ చెప్పారు. ఈ చిత్రంలో జైసిచాన్ తో పాటు నికోలాస్, షావన్, యుజింగ్, క్వంగ్, లమ్ కవాహ్, సమ్ లీ తదిరులు నటించారు. తెలుగు వెర్షన్ కు శశికుమార్ సంభాషణలు అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|