నటిగా ఇంకా తొలి చిత్రం బోణీ కొట్టకుండానే కార్తీక ఇప్పుడు సినీగోయెర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. సీనియర్ నటి రాధ కుమార్తె అయిన కార్తీక 'జోష్' చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయవుతోంది. ఇందులో నాగార్జున తనయుడు నాగచైతన్య కు జోడిగా ఆమె నటిస్తోంది. ఈమధ్యనే ఈ చిత్రం ఆడియోలో కార్తీక తొలిసారి జనం ముందుకు వచ్చింది. ఇది జరిగి వారం పదిరోజులు కూడా తిరక్కుండానే కార్తీకకు దగ్గరయ్యేందుకు ఓ యువహీరో ప్రయత్నంచి టీజ్ చేయబోయారంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
కార్తికకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన యువహీరోపై ఆమె నేరుగా నాగార్జునకు ఫిర్యాదు చేసిందట. నాగార్జున ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుని సదరు హీరోను మందలించి, కెరీర్ పాడు చేసుకోవద్దని హితవు పలికారట. నాగ్ బరిలోకి దిగడంతో ఆ యువహీరో తోకముడిచారట. ఇంతకూ ఎవరూ యువహీరో అంటారా? ఓ క్లూ కూడా ఉంది. ఈ కుర్రహీరో వరుసగా రెండు హిట్లు ఇచ్చారు. మూడో సినిమా యావరేజ్ అనిపించుకుంది. ఎవరో ఊహించండి?!