'మగధీర' బుకింగ్స్ క్లోజ్
తెలుగు సినీ చరిత్రలో బిగ్గెస్ట్ రిలీజ్ గా రామ్ చరణ్ 'మగధీర' చిత్రం విడుదలకు ముందే రికార్డులు సొంతం చేసుకుని శుక్రవారంనాడు భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో 1200 ప్రింట్లతో 1500 థియేటర్లలో పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. ఒక్క జంట నగరాల్లోనే 50 థియేటర్లలో విడుదలవుతున్నప్పటికీ బుకింగ్ తెరచిన గంటలోనే మూడు రోజుల వరకూ అడ్వాన్స్ బుకింగ్ క్లోజ్ అయిపోయింది. 1000 రూపాయల వరకూ బ్లాక్ ధర పలుకుతుండటంతో టిక్కెట్లు ఆశించిన మెగాభిమానులు అనేకమంది నిరుత్సాహానికి గురవుతున్నారు. శుక్ర, శని, ఆది వారాల్లో అన్ని షోలకు బుకింగ్ క్లోజ్ అయినట్లు థియేటర్ల వద్ద బోర్డులు కనిపిస్తున్నాయి.
తెలుగు సినీ చరిత్రలోనే ఈ చిత్రాన్ని దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మించడం, ఇటీవల విడుదలైన ట్రై లర్స్, కీరవాణి సంగీతం అందించిన ఆడియో 'మగధీర' చిత్రంపై భారీ అంచనాలను పెంచింది. రామ్ చరణ్ ఇందులో డాన్సింగ్, హార్స్ రైడింగ్ స్కిల్స్ చూపడంతో పాటు పీరియాడిక్ ఫిల్మ్ గా భారీ సాంకేతిక విలువలుతో ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ప్రస్తుతం రికార్డులపై తన దృష్టిలేదనీ, సినిమా రిలీజ్ తర్వాత ఆ ముచ్చటనీ రామ్ చరణ్ చెబుతున్నారు. వరల్డ్ సినిమాకి థీటుగా ఈ చిత్రం ఉంటుందని రాజమౌళి ధీమాగా ఉన్నారు. మరికొద్ది గంటల్లోనే 'మగధీర' సృష్టించబోయే సంచలనాలకు తెరలేవనుంది.
Be first to comment on this News / Article!
|