'మగధీర' స్క్రీనింగ్ కు చిరు
ఈ ఏడాది ఇంతవరకూ విడుదలైన చిత్రాల్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 'మగధీర' చిత్రం భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. గురువారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల స్పెషల్ స్క్రీనింగ్స్ జరుగనున్నాయి. కొన్నిచోట్ల శుక్రవారంనాడు 8 షోలు నడిపేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైద్రాబాద్ లోని సినీమాక్స్ లో గురువారం రాత్రి 9 గంటలకు జరుగనున్న స్పెషల్ స్క్రీనింగ్ కు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు చిత్ర యూనిట్ హాజరు కానున్నారు. ఈ ఏడాది విడుదలవుతున్న చిత్రాల్లో ఎక్కువ నిడివి గల చిత్రం ఇదేనని కూడా మెగాభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ చిత్రం నిడివి 3 గంటల 40 నిమిషాలు ఉంటుందనే ప్రచారం జరిగనప్పటికీ గీతా ఆర్ట్స్ కార్యాలయ వర్గాల సమచారం ప్రకారం 2.46 నిమిషాలకు దర్శకుడు రాజమౌళి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కలిసి నిడివిని కుదించినట్టు తెలిసింది. మొత్తం 14,400 అడుగుల ఫూటేజితో 16 రీళ్లుగా ఈ చిత్రం ఉండబోతోంది. సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా 1200 ప్రింట్లతో 1500 థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. అమెరికాలో 25 ప్రింట్లతో 40కి పైగా థియేటర్లలో సుప్రీం అధినేత రాజు హిర్వానీ పంపిణీ చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా ఇన్ని ప్రింట్లతో ఓవర్ సీస్ లో విడుదల కావడం ఇదే మొదటిసారి.
Be first to comment on this News / Article!
|