ప్రియమణి థ్రిల్లర్...
గ్లామర్ పాత్రలు చేస్తూనే నటనకు అవకాశమున్న పాత్రల్లోనూ ప్రియమణి సత్తా చాటుకుంటోంది. మేకప్ లేకుండా నటించిన తమిళ 'పరుత్తి వీరన్' ఆమెను జాతీయ స్థాయి ఉత్తమ నటిని చేసింది. ఈమధ్యనే మలయాళ 'తిరక్కాథై' చిత్రంలో ఆమె నటనకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. డబ్బింగ్ చెప్పలేదనే కారణంగా ప్రియమణి ఈ చిత్రానికి కొద్దిలో స్టేట్ అవార్డు చేజార్చుకుంది. ఇతర భాషల్లో ఆమె ప్రతిభాపాటవాలు చాటుకునే అవకాశాలు వస్తున్నా ఇంతవరకూ తెలుగులో అలాంటి అవకాశం ఆమెకు రాలేదనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి అవకాశమే ప్రియమణి తలుపు తట్టింది. ప్రియమణి చుట్టూ తిరిగే ఓ థ్రిల్లర్ కథా చిత్రానికి ప్రియమణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ చిత్ర కథ విన్న వింటనే మరోమాటకు తావులేకుండా ప్రియమణి అగ్రిమెంట్ చేయడం విశేషం.
ప్రియమణి ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రాన్ని కెబిసి బ్యానర్ పై కుమార్ బ్రదర్స్ నిర్మించనున్నారు. కార్తికేయ గోపాల కృష్ణ అనే యువకుడు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. యువ రచయిన శ్యామ్ మనోహర్ ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే అందించనుండగా, మడూరి మధు సంభాషణలు అందించనున్నారు. ప్రియమణికి జంటగా ఒక యువహీరో నటించనున్నారు. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రియమణి ప్రస్తుతం మణిరత్నం 'రావణ్', మదన్ దర్శకత్వంలో జగపతిబాబు సరసన 'ప్రవరాఖ్యుడు' చిత్రాల్లో నటిస్తోంది. బాలకృష్ణ 'భీష్మ'లోనూ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.
Be first to comment on this News / Article!
|