'మగధీర' కోసం 21 స్క్వాడ్లు
రామ్ చరణ్ 'మగధీర' చిత్రం ఫీవర్ ఇప్పుడు ఆంధ్రరాష్ట్రమంతటా కనిపిస్తోంది. తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక వ్యయం, 1200 భారీ ప్రింట్లతో 14 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న అల్లు అరవింద్ తన సినిమాని అన్ని వైపుల నుంచి కాపాడుకునేందుకు పూర్తి శక్తియుక్తులు కూడా ఒడ్డుతున్నారు. ఇలా తెరమీదకు రాగానే అలా కెమెరాల్లో చుట్టేసి పైరసీ డీవీలతో మార్కెట్ ను ముంచెత్తే పైరసీదారుల బారిన 'మగధీర' పడకుండా 21 ఫ్లైయింగ్ స్క్కాడ్ లను ఆయన రంగంలోకి దింపుతున్నారు.
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసే ఆ ఫలాలు పైరసీదారులు అక్రమంగా జేబుల్లోకి నింపుకోవడం తెలుగు సినిమాను పట్టిపీడుస్తున్న ప్రధాన సమస్యగా నిలుస్తోంది. అయితే పైరసీదారులకు ముకుతాడు వేసేందుకు అల్లు అరవింద్ భారీగా ప్లానింగ్ చేశారు. శుక్రవారం తొలి ఆట ప్రారంభమైనప్పటి నుంచి పైరసీ వ్యవహారం ఎక్కడ జరిగినా కూపీ లాగి వారి ఆటకట్టించేందుకు 18 బృందాలు నిరంతరం నిఘా వేసి ఉంటాయి. బెంగుళూరు, చెన్నై సిటీల నుంచి జరిగే పైరసీ ఆపరేషన్లపై మరో 2 బృందాలు పనిచేస్తుంటాయి. మరో బృందంలో టెక్నికల్ సిబ్బంది ఉంటుంది. ఈ స్పెషల్ స్క్కాడ్స్ లో పలువురు మాజీ పోలీసులను కూడా తీసుకున్నారు. ఆన్ లైన్ లో సినిమా ప్రత్యక్ష్యమైతే వెంటనే ట్రేస్ చేసేందుకు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లోని గీతా ఆర్ట్స్ రూమ్ లో అరడజను కంప్యూటర్లపై సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తుంటారు. తమ మేథోపరమైన సంపదను ఏరకంగానూ ఇతరులు దోచుకునే అవకాశం ఇవ్వకూడనే కృతనిశ్చయంతో దర్శకనిర్మాతలు ఉన్నారు.
Be first to comment on this News / Article!
|