హీరోగా ధర్మవరపు
బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, సునీల్, ఆలీ, వేణుమాధవ్, ఏవీయస్...ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు కమెడియన్లు హాస్యనటులుగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారే. ఇప్పుడు ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రమణ్యం వంతు వచ్చింది. ధర్మవరపు కథానాయకుడుగా రాజా ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రాజా ఆర్.ఆర్. ఓ కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి రామ్ కుమార్ దర్శకుడు. ధర్మవరపు సుబ్రమణ్యం జోడిగా ఆర్తి అగర్వాల్ నటించనున్నారు.
ధర్మవరపు, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ తరహాలోనే ఈ చిత్రం కూడా చక్కటి కథాకథనాలతో వైవిధ్యంగా ఉండబోతోందని నిర్మాత రాజా తెలిపారు. కమెడియన్ గా మంచి గుర్తింపు ఉన్న ధర్మవరపు ఈ సినిమాలో వినూత్నంగా కనిపించనున్నారనీ, ఆర్తి అగర్వాల్ తో పాటు షఫాలీ శర్మ, మరో కొత్తమ్మాయి హీరోయిన్లుగా నటించబోతున్నారనీ ఆయన తెలిపారు. ఆగస్టు 5న అన్నపూర్ణా స్టూడియోస్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సూర్య, ఎల్.బి.శ్రీరామ్, దువ్వాసి మోహన్, జీవా, తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి దీపికా రాజు మాటలు, పైడాల శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించనున్నారు.
Read 3 Comment(s) posted so far on this News / Article!
|