తనీష్ 'మంచివాడు'
'నచ్చావులే', 'రైడ్' వంటి హిట్ చిత్రాల కథానాయకుడు తనీష్ తో ప్రతిష్ఠాత్మక సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ఓ కొత్త చిత్రాన్ని రూపొందించనుంది. దీనికి 'మంచివాడు' అనే టైటిల్ ఖరారు చేశారు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పి.లక్ష్మీనారాయణ ('అందాలరాముడు' ఫేమ్) ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రికార్డింగ్ శుక్రవారంనాడు సూపర్ గుడ్ థియేటర్ లో ప్రారంభమైంది. 'ఏదీ ఆ వెన్నెల ...మెరిసే చెలికల్లలో...కురిసే ఆ వెన్నెల..' అంటూ ఇ.ఎన్.మూర్తి రాసిన గీతాన్ని ఉన్నిమీనన్ పాడగా రికార్డ్ చేశారు.
ఆర్.బి.చౌదరి మాట్లడుతూ, తనీష్ ఇందులో అందరూ పాత్రను పోషించనున్నారనీ, కథాపరంగా హీరో ఉత్తమ గుణాలు కలిగిన మంచి కుర్రాడనీ, అందుకే 'మంచివాడు' పేరుతో పాటల రికార్డింగ్ ప్రారంభించామనీ చెప్పారు. తమ బ్యానర్ లో 'అందాలరాముడు' వంటి హిట్ చిత్రం చేసిన దీప్తికి దర్శకుడిగా మరో అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ఇంటిలిపాదీ మెచ్చే మంచి కథతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశామని
పరాస్ జైన్ తెలిపారు. ఆగస్టు 15న షూటింగ్ ముహార్తం ప్రారంభించి, 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ తో సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తామనీ తెలిపారు. తనీష్ కు జోడిగా ధామ నటించనుంది. కోటి తనయుడు రాజీవ్ మరో ప్రధాన పాత్ర పోషిస్తారు. కె.విశ్వనాథ్, చంద్రమోహన్, వేణుమాధవ్, రఘుబాబు, కోవైసరళ, సుధ, తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి ఇఎస్.మూర్తి, అభినవ శ్రీనివాస్ పాటలు, వేణుగోపాల్ సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్, శిల్పి సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|