'మిత్రుడు' చిత్రం హీరో బాలకృష్ణకు అనుకున్న సక్సెస్ ఇవ్వకపోయినా ఆయన స్టైలిష్ గా కనిపించడం అభిమానులను అలరించింది. మునుముందు బాలయ్య నుంచి సరైన హిట్లు వస్తాయనే ధీమానూ కలిగించింది. బాలకృష్ణ సైతం స్పీడు పెంచి కొద్దిపాటి తేడాతో ఏకకాలంలో రెండు సినిమాలకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న కొత్తి చిత్రం ఈనెల 6న ప్రారంభం కాబోతోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కీర్తి నిర్మాతగా 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. బాలకృష్ణకు జోడిగా నయనతారను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
'లక్ష్మీ', 'తులసి' వంటి హిట్ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన హ్యాట్రిక్ సక్సెస్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. బాలకృష్ణ ఇమేజ్ ను పెంచే ఇతివృత్తంతో స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిచన్నారు. మరోవైపు బాలకృష్ణ కథానాయకుడుగా ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకొన్ని 'భీష్మ' చిత్రం
కూడా గ్రాండ్ లాంచింగ్ కు రెడీ అవుతోంది. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మాతగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.