ముస్తాబైన 'స్నేహితుడా'
నాని ('రైడ్' ఫేమ్), మాధవీలత ('నచ్చావులే') జంటగా జెమినీ ఫిలిమ్స్ సర్క్యూట్స్ సమర్పణలో సత్యం ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న 'స్నేహితుడా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ద్వారా సత్యం బెల్లంకొండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 7న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకుడు సత్యం తెలిపారు.
లవ్, సకుటుంబ సమేతంగా చూసే అంశాలతో ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తీర్చిదిద్దామనీ, అన్నివర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం అలరిస్తుందనీ ఆయన చెప్పారు. 'ప్రియమైన నీకు' వంటి మ్యూజికల్ హిట్ చిత్రానికి సంగీతం అందించిన శివశంకర్ ఈ చిత్రంలోని ఆరు పాటలకు అద్భుతమైన సంగీతం ఇచ్చారని అన్నారు. పాటల్లోని సాహిత్యం, భాషాశ్రీ సంభాషణలు ఎంతో సహజంగా ఉంటాయని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాజర్, సుత్తివేలు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయ, మేల్కొటి, దువ్వాసి, సుభాషిణి తదితరులు నటిస్తున్నారు. భాషాశ్రీ మాటలు-పాటలు, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, వాసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|