యువజంట 'మౌనరాగం'
తనీష్ ('నచ్చావులే' ఫేమ్), మధురిమ ('ఆ ఒక్కడు' ఫేమ్) జంటగా రూపొందుతున్న ప్రేమకథా చిత్రం 'మౌనరాగం'. శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ బాలాజీ దర్శకుడు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని మలి షెడ్యూల్ కు రెడీ అవుతోందని నాగం అశోక్ కుమార్ తెలిపారు.
జూలై 2న ప్రారంభించిన ఈ చిత్రం 27 వరకూ తొలి షెడ్యూల్ జరుపుకొందనీ, ఇందులో భాగంగా హైద్రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిలింసిటీలో వేసిన ఎయిర్ పోర్ట్ సెట్, రైల్వే ట్రాక్ పై కొన్ని సన్నివేశాలు, చిన్న శంకరపల్లిలో మరికొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించినట్టు తెలిపారు. ఈనెల 6 న రెండో షెడ్యూల్ ప్రారంభించి టాకీ పార్ట్ పూర్తి చేస్తామని చెప్పారు. సకుటుంబ సమేతకంగా చూసే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, సుహాసిని, భూపాల్, ప్రసాద్ బాబు, ఆలీ, జీవా, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ, హేమ తదితరులు నటిస్తున్నారు. చింతపల్లి రమణ మాటలు, షమన్ మిత్రు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|