రోహిత్ 'బాణం' సెప్టెంబర్ 16
కొత్త హీరోలను పరిచయం చేయడంలోనూ, మూడు దశాబ్దాలుగా నటరత్న ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకూ ఎందరో స్టార్ హీరోలతో చిత్రాలు నిర్మించిన భారీ చిత్రాల నిర్మాణ సంస్థగానూ వైజయంతీ మూవీస్ సంస్థకు పేరుంది. ఆ సంస్థ అధినేత చలసాని అశ్వనీదత్ ముగ్గురు కుమార్తెలు సైతం ఇప్పుడు వైజయంతికి అనుబంధంగా 'త్రీ ఏంజెల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంగా ఈ సంస్థ నిర్మిస్తున్న 'బాణం' శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆడియో విడుదల గ్రాండ్ గా నిర్వహించి నటీనటులను ఇదే వేదికపై పరిచయం చేయబోతున్నారు.
నారా చంద్రబాబునాయుడు సోదరుడైన రామ్మూరి నాయుడు తనయుడు నారా రోహిత్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయవుతున్నారు. వేదిక హీరోయిన్. సీనియర్ పాత్రికేయుడు, రచయిత నారాయణమూర్తి కుమారుడు చైతన్య ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమ సంస్థ తొలి చిత్రంగా నిర్మితమవుతున్న 'బాణం' కోయంబత్తూరులో జరిపిన తుది షెడ్యూల్స్ తో శనివారం నాడు షూటింగ్ పూర్తి చేసుకుందని నిర్మాత శేషు ప్రియాంక తెలిపారు. విశాఖ, శ్రీకాకుళం, అరకు, ఊటీ, పొల్లాచ్చి వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరిపినట్టు చెప్పారు. ఈనెలలోనే ఆడియో విడుదల చేసి సెప్టెంబర్ 16న సినిమా రీలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి నాగరాజు మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|