బాలకృష్ణకు జోడిగా నమిత
హాట్ అండ్ సెక్సీ బ్యూటీ నమిత మళ్లీ తెలుగులో బిజీ అవుతోంది. తొలినాళ్లలో తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాని నమిత ఆ తర్వాత తమిళంలో క్రేజీ హీరోయిన్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోంది. ఈమధ్యనే 'బిల్లా' చిత్రంలో ప్రభాస్ ప్రియురాలిగా నటించిన నమిత, ప్రస్తుతం 'జగన్మోహిని' చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది. 'దేశద్రేహి' అనే యాక్షన్ ఎంటర్ టైనర్ లోనూ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజాగా మరో బిగ్ ప్రాజెక్ట్ కూడా నమిత చేతుల్లోకి వచ్చింది. యువరత్న బాలకృష్ణకు జోడిగా యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కీర్తి నిర్మించనున్న చిత్రంలో ఒక హీరోయిన్ గా నమిత ఎంపికైంది. ప్రధాన హీరోయిన్ గా నయనతార పేరు వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ఇంకా ఖరారు కావలసి ఉంది.
'లక్ష్మీ', 'తులసి' వంటి హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా గత చిత్రాలను తీర్చిదిద్దిన బోయపాటి శ్రీను ఈసారి బాలకృష్ణను వైవిధ్యంగా చూపించబోతున్నారు. 15 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈనెల 6న ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది.
Be first to comment on this News / Article!
|