నాగచైతన్యతో గౌతమ్ మీనన్
నాగార్జున తనయుడైన నాగచైతన్య హీరోగా పరిచయవుతున్న 'జోష్' చిత్రం భారీ అంచనాల మధ్య ఈనెలలోనే విడుదలకు ముస్తాబవుతోంది. నాగార్జున పోలికలు, స్టయిల్ నాగచైతన్యలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుండటం, యూత్ ఫుల్ కథాంశాలతో వరుస హిట్లు సాధిస్తున్న దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత కావడం ఈ చిత్రంపై మంచి అంచనాలకు తావిస్తోంది. దిల్ రాజు చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసిన వాసువర్మ ఈ చిత్రాన్ని యాక్షన్ తో కూడిన ప్రేమకథా ఇతివృత్తంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈనెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య ద్వితీయ చిత్రం ఏ బ్యానర్ లో ఉండబోతోంది, దర్శకుడెవరనే క్యూరియాసిటీ అభిమానుల్లో కనిపిస్తోంది. నాగచైతన్య ద్వితీయ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన ఇప్పటికే సునీల్ తో కామెడీ హారర్ 'మర్యాద రామన్న' చిత్రానికి కమిట్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య తదుపరి చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ బాబు సోదరి మంజుల నిర్మించనున్నారు.
మహేష్ బాబుతోనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని మంజుల ఇప్పటికే అనౌన్స్ చేశారు. కొద్దినెలలుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. తాజాగా నాగచైతన్య-గౌతమ్ మీనన్-మంజుల కాంబినేషన్ చిత్రం ముందుకు వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం ప్రారభం కానుంది. నాగచైతన్య హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్న చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో ఉంటుంది.
Be first to comment on this News / Article!
|